చెర్రీ మూవీ లొకేష‌న్ పిక్ లీక్‌

Tue,October 16, 2018 11:06 AM
rc 12 leaked pic viral internet

ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా సినిమాకి సంబంధించిన ఔట్‌పుట్ బ‌య‌ట‌కు రాకుండా అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా రామ్ చ‌ర‌ణ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం చిత్ర షూటింగ్ సింహాచ‌లం ప‌రిస‌ర ప్రాంతాలలో జ‌రుగుతుండ‌గా, ర‌ఫ్ లుక్‌లో ఉన్న చెర్రీ ఫోటోలు బ‌య‌ట‌కి వ‌చ్చాయి. ఫోటోల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇవి యాక్ష‌న్ సీన్‌కి సంబంధించిన‌విగా అర్ద‌మ‌వుతుంది. ద‌సరా కానుక‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్నార‌ని అంటున్నారు. విన‌య విధేయ రామ అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్, ఆర్య‌న్ రాజేష్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . క‌న్న‌డ హీరో సుదీప్‌ ఈ సినిమాలోను విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు.

2069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS