మరోసారి పోలీస్‌ ఆఫీసర్ గా రవితేజ !

Fri,July 29, 2016 05:10 PM
raviteja plays a cop role in next


హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ రవితేజ బెంగాల్ టైగర్ హిట్ తర్వాత మరో సినిమాకు కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు పలు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించిన రవితేజ మరోసారి ఖాకీ చొక్కాను ధరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. రవితేజ గతంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన విక్రమార్కుడు, పవర్, బలుపు చిత్రాలు బాక్సాపీస్ వద్ద హిట్‌టాక్‌ను తెచ్చుకున్నాయి.

ఇపుడు తాజాగా విక్రం సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో రవితేజ ‘బాద్‌షా పోలీస్‌మ్యాన్‌’గా కనిపించనున్నారని ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. రవితేజ, విక్రమ్ సిరికొండ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీకి వక్కంతం వంశీ కథనందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS