రవితేజ ‘రాజా ది గ్రేట్’ రిలీజ్ టైం ఫిక్స్..!

Mon,July 17, 2017 10:57 PM
raviteja new movie to relaese in october?


హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ రవితేజ కొంత గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫ్యాన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. మెహరీన్ కౌర్, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. దిల్ రాజు నిర్మిస్తున్న రాజా ది గ్రేట్‌ను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రవితేజ లేటెస్ట్ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తయింది. విడుదల తేదీపై మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్టు తర్వాత విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో రానున్న టచ్ చేసి చూడు మూవీకి టైం కేటాయించనున్నాడు రవితేజ.

2020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS