రవితేజ 'నేల టిక్కెట్టు' ట్రైలర్ వచ్చేసింది..!

Wed,May 16, 2018 09:38 PM
Raviteja Nela Ticket Theatrical Trailer

బెంగాల్ టైగ‌ర్ చిత్రం త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు చిత్రాల‌తో అల‌రించిన మాస్ రాజా ప్ర‌స్తుతం కళ్యాణ్‌కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వంలో నేల టిక్కెట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుద‌ల చేశారు.

గ్రామీణ‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా రవితేజ శైలి హంగులతో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. అనుబంధాలు, ఆప్యాయతలకు విలువనిచ్చే ఓ యువకుడు తనవారి క్షేమం కోసం ఏం చేశాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. క్లాస్, మాస్ హంగుల మేళవింపుతో రవితేజ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. మాళ‌విక శ‌ర్మ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. శక్తికాంత్ చిత్రానికి సంగీతం అందించారు.

3282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles