రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదు : తల్లి రాజ్యలక్ష్మి

Mon,July 17, 2017 12:03 PM
రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదు : తల్లి రాజ్యలక్ష్మి

హైదరాబాద్ : సినీ హీరో రవితేజకు డ్రగ్స్ అలవాటు లేదని ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. భరత్ మరణం, రవితేజపై డ్రగ్స్ ఆరోపణలపై తల్లి రాజ్యలక్ష్మి స్పందించింది. డ్రగ్స్ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమన్నారు. రవితేజకు ఎలాంటి అలవాటు లేదన్న తల్లి.. సిగరెట్ కూడా తాగడు, తాగేవాళ్లను ప్రోత్సహించడు అని పేర్కొన్నారు. తన కుమారుడికి డ్రగ్స్ అలవాటు ఉందన్న మాట అవాస్తవమని చెప్పారు. కావాలనే ఈ కేసులో రవితేజను ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టెడు దుఃఖంలోనే రవితేజ సినిమాలు చేస్తున్నాడని తెలిపారు రాజ్యలక్ష్మి. నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. తమ కుటుంబం ఆచారం ప్రకారం భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు.

మద్యం మత్తులో భరత్ చనిపోయాడనేది అవాస్తవం


మద్యం మత్తులోనే రోడ్డుప్రమాదంలో భరత్ చనిపోయాడనేది అవాస్తమని తల్లి రాజ్యలక్ష్మి చెప్పారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే భరత్ అన్నీ మానేశాడని తెలిపారు. భరత్ బిగ్ బాష్ షోకు ఎంపికయ్యాడు.. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన చెందారు. తన కుమారుడిని దారిలో పెట్టేందుకు రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్ని అని పేర్కొన్నారు. భరత్‌ను రవితేజను ముడిపెట్టి చూడొద్దని తల్లి రాజ్యలక్ష్మి సూచించారు.

3691

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018