డైరెక్ష‌న్ వైపు అడుగులేస్తున్న ర‌వితేజ ?

Sat,March 16, 2019 10:38 AM
Raviteja  diects kalyan ram

బెంగాల్ టైగ‌ర్ మూవీ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ రాజా ది గ్రేట్ చిత్రం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. దీని త‌ర్వాత వ‌చ్చిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటుగా తమిళ హిట్ 'తేరి'కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి క‌న‌క‌దుర్గ అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. అయితే న‌టుడిగా సినిమాలు చేస్తూనే ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేయాల‌ని ర‌వితేజ భావిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల క‌ళ్యాణ్ రామ్‌ని క‌లిసిన ర‌వితేజ ఓ ఇంట్రెస్టింగ్ క‌థ‌ని చెప్పాడ‌ట‌. ఈ క‌థ నంద‌మూరి హీరోకి న‌చ్చ‌డంతో త‌ను హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. ర‌వితేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. క‌ళ్యాణ్ రామ్ నిర్మాణంలో ర‌వితేజ కిక్ 2 అనే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ర‌వితేజకి గ‌తంలో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.

1498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles