తమిళ్ రీమేక్‌లో నటించనున్న రవితేజ, రానా ?

Thu,October 26, 2017 09:09 AM
Raviteja and Rana to act in Tamil Remake

మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ ఇద్దరు నటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాను త్వరలో తెలుగులో రీమేక్ చేయనున్నారట. ఇందులో నాగార్జున, వెంకటేష్, రానా, మాధవన్‌లలో ఎవరైనా ఇద్దరు నటించవచ్చని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్నదేమిటంటే.. ఈ సినిమాలో రవితేజ, రానాలు నటించనున్నట్టు సమాచారం. ఇందులో సేతుపతి పాత్రలో రవితేజ, మాధవన్ పాత్రలో రానాలు నటిస్తారని తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా తమిళంలో 'విక్రమ్ వేద'కు పుష్కర్, గాయత్రిలు దర్శకత్వం వహించగా, తెలుగులో ఎవరు డైరెక్ట్ చేస్తారనేది వేచి చూస్తే తెలుస్తుంది.

2468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles