వర్మ కోసం గాయకుడిగా మారిన రవిశంకర్..వీడియో

Mon,February 11, 2019 09:05 PM
Ravishankar turns as singer for laxmis NTR Movie

రవిశంకర్..డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సాయికుమార్ సోదరుడిగా అందరికీ సుపరిచితుడే. అరుంధతీ సినిమాలో వదల బొమ్మాళీ..వదల అంటూ రవిశంకర్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఇప్పటివరకు డబ్బింగ్ తో, నటనతో మెప్పించిన రవిశంకర్ తాజాగా గాయకుడి అవతారమెత్తాడు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రవిశంకర్ తో ప్రత్యేకంగా పాట పాడించాడు వర్మ. సిరాశ్రీ రాసిన 'సింహ గర్జన' పాటకు కల్యాణ్ మాలిక్ సంగీత సారథ్యంలో రవిశంకర్ ఈ పాటను పాడాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం బొమ్మాళీ రవిశంకర్ ఉరుములు పుట్టించే పాట అంటూ..స్టూడియోలో రవిశంకర్ పాట పాడుతున్న వీడియోను వర్మ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ పాట ఆన్ లైన్ లో ట్రెండింగ్ అవుతోంది.
3227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles