త‌మిళ మ‌న్మ‌ధుడితో లింగా డైరెక్ట‌ర్ చిత్రం..!

Tue,December 19, 2017 11:09 AM
ravikumar next with aravind swamy

ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో లింగా అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన కెఎస్ ర‌వికుమార్ ప్ర‌స్తుతం బాల‌య్య 101వ సినిమాతో బిజీగా ఉన్నాడు. జై సింహా అనే టైటిల్‌తో ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు. న‌య‌న‌తార ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకి తీసుకు రానున్నాడు. అయితే త్వ‌ర‌లో తమిళ మ‌న్మ‌ధుడు అర‌వింద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌లో ఓ త‌మిళ చిత్రం చేయ‌నున్నాడు కెఎస్ ర‌వికుమార్. భాస్క‌ర్ ఒరు రాస్కెల్ చిత్రం నిర్మించిన హ‌ర్షిన్ మూవీస్ బేన‌ర్‌పై ఈ చిత్రం రూపొంద‌నుంది. అయితే ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని ర‌వికుమార్ భావ‌స్తున్నాడ‌ట‌. అదీకాక అర‌వింద్ స్వామి ఈ మూవీ కోసం పెద్ద‌గా రెమ్యున‌రేష‌న్ ఏమీ డిమాండ్ చేయ‌డం లేద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ రికార్డులు తిర‌గరాసేలా రూపొందిస్తామ‌ని నిర్మాత‌లు అంటున్నారు.

1020
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles