మార్చిలో రవితేజ రాబిన్‌హుడ్

Tue,February 9, 2016 12:05 PM


హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ రవితేజ బెంగాల్‌టైగర్ సినిమాతో గతేడాది బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ అది మధ్యలోనే అటకెక్కిన విషయం తెలిసిందే. దీంతో రవితేజ కొత్త దర్శకుడు చక్రితో చేయాల్సిన సినిమాపై దృష్టి పెట్టాడు.


రాబిన్ హుడ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. దామోదర్ ప్రసాద్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు అమీజాక్సన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. అమీజాక్సన్ కు బిజీబిజీగా ఉండటంతో వీరి ప్రాజెక్టుకు ఒకే చెబుతుందోలేదో వేచి చూడాలి మరీ. సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా రోబో-2లో అమీజాక్సన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

2407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles