వాస్త‌వ సంఘ‌ట‌నల ఆధారంగా ర‌వితేజ చిత్రం..!

Thu,November 7, 2019 09:40 AM

మాస్ రాజా రవితేజ న‌టించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ర‌వితేజ 66వ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ చిత్రం త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం థేరికి రీమేక్‌గా తెర‌కెక్క‌నుంద‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చారు. ర‌వితేజ 66వ మూవీ వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్క‌నుంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించ‌నున్నాం అని గోపిచంద్ స్ప‌ష్టం చేశారు. నవంబ‌ర్ రెండోవారం నుండి చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం త‌మిళ స‌ముద్ర‌ఖ‌నిని ఎంపిక చేసింది చిత్ర బృందం. తాజాగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles