ర‌వితేజ కొత్త చిత్రం ప్రారంభం ఎప్పుడో తెలుసా ?

Wed,November 7, 2018 09:58 AM
ravi teja new movie launch on November 13

మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులకి ప‌సందైన వినోదం అందిస్తున్నాడు. ఆయ‌న‌ న‌టించిన తాజా చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని న‌వంబ‌ర్ 16న విడుద‌ల కానుండ‌గా, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌! ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మరో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. న‌వంబ‌ర్ 13న చిత్ర పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గనుండ‌గా, ఆ రోజు మూవీ టైటిల్ లోగో పోస్ట‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.



2304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles