కథ అదే కాని హీరో మారాడు..!

Wed,November 22, 2017 04:09 PM
ravi teja movie assigned to gopi chand

ఒక్కోసారి కథలు తారుమారవుతుంటాయి. ఇంకోసారి హీరోలు తారుమారవుతుంటారు. సినిమా ఫీల్డ్ లో ఇలాంటివి మామూలే. ఒక హీరో కోసం రాసిన కథను ఇంకో హీరోకి అసైన్ చేస్తారు. ఫలానా హీరోను దృష్టిలో ఉంచుకుని కథ రాస్తే.. కొన్ని సందర్భాల్లో ఆ స్టోరీ ఆ హీరోకు నచ్చదు. దీంతో అదే కథని మరో హీరోకు వినిపిస్తే ఓకే చేస్తాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి సీనే రిపీట్ కాబోతుంది.

బెంగాల్ టైగర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రవితేజ త్వరలో టచ్ చేసి చూడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఆ మధ్య ఈ హీరోతో చక్రి అనే దర్శకుడు రాబిన్ హుడ్ అనే టైటిల్ తో సినిమా చేయాలనుకున్నాడట. కాని అనివార్య కారణాల వలన పట్టాలెక్కలేదు. దీంతో చక్రి.. గోపిచంద్ ని కలిసి కథ వివరించాడట. కథ నచ్చడంతో గోపిచంద్ హీరోగా చక్రి రాబిన్ హుడ్ ని ప్లాన్ చేశాడని టాక్. బెంగాల్ టైగర్ నిర్మాత రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని తెలుస్తుండగా, ఇందులో మెహరీన్ కథానాయికగా నటించనుందని టాక్.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles