ఏ మాత్రం స్పీడ్ త‌గ్గించ‌ని ర‌వితేజ‌

Thu,September 20, 2018 12:25 PM
RAVI TEJA CONTINUES HIS SPEED

బెంగాల్ టైగర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ రాజా ది గ్రేట్‌, టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాల‌లో రాజా ది గ్రేట్ మంచి విజ‌యాన్ని సాధించ‌గా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు నిరాశ‌ప‌ర‌చాయి. ప్ర‌స్తుతం శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రం చేస్తున్నారు ర‌వితేజ‌. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న‌ మూవీ విడుద‌ల అవుతుంద‌ని భావించిన‌ప్ప‌టికి, షూటింగ్ పూర్తి కాని కార‌ణంగా చిత్ర రిలీజ్ వాయిదా ప‌డుతుంద‌ని అంటున్నారు. అఅఅ చిత్రంలో ర‌వితేజ మూడు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. శ్రీను వైట్ల- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు భారీ విజ‌యం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ర‌వితేజ మ‌రో ప‌క్క సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్‌, కేథరిన్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక డిసెంబ‌ర్‌లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి .ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ మూవీ చేయ‌నున్నాడు ర‌వితేజ‌. నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, ఇందులో ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తాడ‌ని అంటున్నారు.

2833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles