ర‌వితేజ బ‌ర్త్‌డే రోజు అభిమానుల‌కి డ‌బుల్ గిఫ్ట్

Thu,January 24, 2019 01:12 PM
ravi tejA birthday gift for fans

బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ వ‌రుస‌గా రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్ చిత్రాలు చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ చిత్రం మాత్ర‌మే మంచి హిట్ సాధించింది. ఇక రీసెంట్ గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ కూడా నిరాశ‌ప‌ర‌చింది. దీంతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఈ మూవీకి ‘డిస్కో రాజా’ టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌!

చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుండ‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. మూడో నాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న ఈచిత్రం యొక్క టైటిల్ లోగో ను లాంచ్ చేయనున్నారు. ఇక అదే రోజు కంద‌రీగ ఫేం సంతోష్ శ్రీనివాస్‌తో ర‌వితేజ చేయ‌నున్న ప్రాజెక్ట్ వివ‌రాలు కూడా వెల్ల‌డించ‌నున్న‌ట్టు స‌మాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈచిత్రం కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘తెరి’ కి రీమేక్ గా తెరకెక్కనుంది.6733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles