సైరా టీంలో మ‌రో బాలీవుడ్ న‌టుడు..!

Tue,May 22, 2018 10:12 AM
ravi kishan plays crucial role in syeraa

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. చిరంజీవి, న‌య‌న‌తార‌, అమితాబ్ బచ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో కేవ‌లం టాలీవుడ్‌కి సంబంధించే కాక ప‌లు ఇండ‌స్ట్రీల‌కి చెందిన న‌టులు న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో బాలీవుడ్ న‌టుడు ఈ చిత్రంలో భాగం కానున్నాడ‌ని తెలుస్తుంది. రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా కనిపించి ఎంతోమంది తెలుగు ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు బోజ్‌పురి యాక్టర్ రవికిషన్. ఆ తర్వాత కిక్ 2, లై, ఎమ్మెల్యే సినిమాల్లో కనిపించాడు. ప‌లు హిందీ చిత్రాల‌లోను న‌టించిన ర‌వికిషన్ సైరాలో బ్రిటీష్ వారికి వ్య‌తిరేఖంగా పోరాడిన ప‌ల్లెటూరి వ్య‌క్తిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌త్న‌వేలు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తుండ‌గా, సంగీత ద‌ర్శ‌కుడి విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు.

2087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS