జార్జియా షెడ్యూల్ పూర్తి చేసిన సైరా టీం

Tue,October 23, 2018 09:43 AM
rathna velu shares georjia location pics

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్నఈ చిత్రం కొద్ది రోజులుగా ఆసియా బోర్డర్ జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంది. దాదాపు 40రోజుల పాటు ఈ దేశంలో జ‌రిగిన‌ భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌లో 300 గుర్రాలు,150 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ పాల్గొన్న‌ట్టు స‌మాచారం. అయితే జార్జియా షెడ్యూల్ తాజాగా ముగిసింద‌ని సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు జార్జియా షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించిన ప‌లు పిక్స్ చేశారు. ఈ ఎపిక్ మూవీ క్లైమాక్స్ కోసం అంద‌రరు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. సుదీప్, విజ‌య్ సేతుప‌తి ఈ షెడ్యూల్ లో పాల్గొన‌గా, వీరికి సంబంధించిన ఫోటో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయింది. సైరా చిత్రం వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS