తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన రష్మిక..!

Mon,July 22, 2019 10:25 PM
Rashmika told about how to be her woodby


హైదరాబాద్: ఛలో, గీతగోవిందం వంటి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా. ఈ హీరోయిన్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ చేస్తోంది. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింద రష్మిక. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ..తన కాబోయే భర్త నిజాయితీపరుడై ఉండాలని..అతని ప్రవర్తన నచ్చాలని చెప్పింది. అంతేకాదు కాబోయే భర్తకు మంచి మనస్సు ఉండాలని, అతనితో కలిసి ఎక్కువ సమయం ఉండాలనిపించాలని చెప్పుకొచ్చింది. రష్మిక తన కోస్టార్ రక్షిత్‌ శెట్టిని 2017లో నిశ్చితార్థం చేసుకోగా..గతేడాది సెప్టెంబరులో వీరిరువురి నిశ్చితార్థం రద్దైన విషయం తెలిసిందే.

1236
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles