త్రివిక్రమ్ సినిమాలో రష్మిక..?

Wed,February 6, 2019 06:48 PM
rashmika to sign trivikram movie

ఛలో, కిరాక్ పార్టీ, గీతగోవిందం చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి రష్మిక మందన్నా. ఈ సినిమాల తర్వాత రష్మిక చేయనున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. ైస్టెలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేయాలని భావిస్తుందట చిత్రయూనిట్. హీరోయిన్లుగా పలువురి పేర్లను పరిశీలించిన త్రివిక్రమ్ అండ్ టీం చివరగా రష్మికను ఓకే చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్. డేట్స్ కుదిరితే త్వరలోనే ఈ చిత్రానికి సంతకం చేయాలని భావిస్తుందట రష్మిక. అయితే దీనికి సంబంధించి చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

3423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles