చోరీ చేసే క్యారెక్ట‌ర్‌లో ర‌ష్మిక‌

Sun,December 2, 2018 07:24 AM
rashmika plays key role in Jigarthanda

హిందీ చిత్రం ద‌బాంగ్‌ని తెలుగులో గ‌బ్బ‌ర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి మంచి విజ‌యం సాధించాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంకర్. ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్.. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసిన అవి అంత ఆద‌ర‌ణ‌కి నోచుకోలేక‌పోయాయి. చివ‌రిగా అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో డీజే అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు హ‌రీష్ శంక‌ర్‌. ఈ సినిమా విడుద‌లై ఏడాదిన్న‌ర కావొస్తున్న త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా సినిమాని తెలుగులో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు రాగా, ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ట‌.

థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వ‌రుణ్ తేజ్ , ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. త‌మిళ వ‌ర్షెన్‌లో ల‌క్ష్మీ మీన‌న్ స‌ర‌దా క్యారెక్ట‌ర్‌ని తెలుగులో ర‌ష్మిక‌తో చేయించాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇందులో ర‌ష్మిక చోరీ చేసే అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ప్ప‌టికి చాలా ఫ‌న్‌గా ఉంటుంద‌ట‌. జిగ‌ర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం అంత‌రిక్షం, ఎఫ్ 2 చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా ర‌ష్మిక ‘డియర్‌ కామ్రేడ్‌’, నితిన్‌తో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా చేస్తుంది.

2252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles