విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రిలేష‌న్ షిప్‌పై స్పందించిన ర‌ష్మిక‌

Sun,August 18, 2019 07:26 AM
rashmika opens up  on relation with vijay devarakonda

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో గీతా గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో వీరిద్దరి మ‌ధ్య రొమాన్స్ మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌నే టాక్ బ‌య‌ట‌కి వ‌చ్చింది. చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లోను ర‌ష్మిక‌, విజ‌య్‌లు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుండ‌డం చూసి ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ స్టార్ట్ అయిందా అంటూ చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన ర‌ష్మిక‌... విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడు మాత్రమేన‌ని, అంతకు మించి తామిద్దరి మధ్య మరేం లేదని స్పష్టం చేసింది. దీంతో పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డ్డాయి. ర‌ష్మిక ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇక విజ‌య్ దేవ‌రకొండ‌.. హీరో అనే చిత్రంతో పాటు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

7664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles