మూగ జీవాల‌పై ప్రేమ కురిపిస్తున్న‌ ర‌ష్మిక‌

Thu,December 27, 2018 08:42 AM
Rashmika Mandanna played with animals

ఛ‌లో చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక మంద‌న్నా త‌క్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. ఇటీవ‌ల గీతా గోవిందం, దేవ‌దాస్ చిత్రాల‌తో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో పాటు ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు వీడియోలని షేర్ చేయ‌గా, ఇందులో మూగ‌జీవాలపై ప్రేమ‌ని కురిపిస్తూ క‌నిపించింది. మై లిటిల్ వ‌న్ అంటూ చిన్న కుక్క‌తో ఆడుతూ ఉన్న వీడియోతో పాటు నా ‘బిగ్ బాయ్స్’ వీళ్లే అంటూ పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న వీడియోలని షేర్ చేసింది. పావురం, పిల్లితో దిగిన ప‌లు ఫోటోల‌ని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోల‌పై నెటిజ‌న్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు. మూగ జీవాల‌పై ర‌ష్మిక ప్రేమాయణం బ‌హుబాగుగా ఉంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు2732
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles