కార్తీ-రష్మిక జంటగా కొత్త చిత్రం

Mon,February 25, 2019 04:35 PM
Rashmika Mandanna makes her Tamil debut with Karthi film

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన యంగ్ హీరో కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. కార్తీ 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘గీత గోవిందం’ ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ‘ఎన్.జీ.కె’ నిర్మిస్తున్న ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.


‘ఖాకీ’ చిత్రాన్ని 1995 నుంచి 2005 మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుద‌లైన సినిమా సూప‌ర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.

1485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles