విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ర‌ష్మిక మంధాన

Thu,March 21, 2019 12:31 PM

ర‌ష్మిక మంధాన ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర కాగా, గీతా గోవిందంతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండతో డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. మే 31న విడుద‌ల కానున్న‌ ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన టీజ‌ర్‌ని ఇటీవ‌ల‌ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. టీజ‌ర్ చివ‌రిలో విజ‌య్, ర‌ష్మిక‌ల మ‌ధ్య లిప్ లాక్ సీన్ ఉండ‌గా, దీనిపై నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు .

నీ లిప్‌లాక్ కారణంగా నువ్వంటే నాకు అసహ్యమేస్తోంది అంటూ ఓ అభిమాని కామెంట్ చేయ‌గా, మ‌రో అభిమాని అవ‌కాశాల కోసం ఇలా చేస్తున్నావా అని కామెంట్ పెట్టాడు. ఓ నెటిజ‌న్ రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘రిప్ రక్షిత్ శెట్టి’ అని ట్వీట్ చేశారు. క‌న్న‌డ నాట కూడా ఈమెపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో రష్మిక ఇంటర్వ్యూ ద్వారా నెటిజ‌న్ల కామెంట్స్‌కి బ‌దులిచ్చింది. అవ‌కాశాల కోసం ఆ సీన్ చేసాను అనేది అవాస్త‌వం. ఇచ్చిన పాత్ర‌కి న్యాయం చేశాను అని నేను భావిస్తున్నాను. ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా న‌టించాం. సీన్ డిమాండ్ చేయ‌డం వ‌ల‌న అలా చేశాం త‌ప్ప కావాల‌ని చేసింది కాదు అని ర‌ష్మిక వివ‌ర‌ణ ఇచ్చింది.

4495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles