ముద్దు సీన్‌లో న‌టించ‌డంపై క్లారిటీ ఇచ్చిన‌ ర‌ష్మిక‌

Sun,July 14, 2019 10:51 AM

కన్న‌డ భామ ర‌ష్మిక ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. వ‌రుస సినిమాల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఒక‌వైపు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తూనే మ‌రోవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తుంది. మ‌హేష్ బాబు- అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంలో కథానాయిక‌గా న‌టిస్తుంది ర‌ష్మిక‌. మ‌రో వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టించింది ర‌ష్మిక‌. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ర‌ష్మిక లిప్ లాక్ స‌న్నివేశాల‌లో న‌టించింది. అప్ప‌ట్లో దీనిపై పెద్ద చ‌ర్చే న‌డించింది. ఓ ఇంటర్వ్యూలో ముద్దు సన్నివేశాల‌లో న‌టించడం గురించి వివ‌రించింది. కోపం, బాధ‌, త‌ర‌హాలోనే ముద్దు. అది కూడా ఓ ఎమోష‌నే. న‌టిగా దాన్ని కూడా పండించాలి. ముద్దు స‌న్నివేశాల‌ని న‌ట‌న నుండి వేరుగా చూడ‌లేమంటూ పేర్కొంది రష్మిక‌.

3322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles