ర‌ష్మీ నెంబ‌ర్ కోసం వెరైటీ ప్లాన్.. బోల్తా ప‌డ్డ పీఆర్‌

Thu,March 14, 2019 08:52 AM
Rashmi Gautam strong counter to netigen

జ‌బ‌ర్ద‌స్త్ అనే కామెడీ షోతో ఫుల్ పాపుల‌ర్ అయిన‌ న‌టి ర‌ష్మి. వెండితెర‌పై కూడా అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీ అప్పుడ‌ప్పుడు త‌న అభిమానుల‌తో లైవ్ చాట్ చేస్తుంది. ఆ స‌మ‌యంలో కొంద‌రి వ‌ల‌న విచిత్ర అనుభ‌వాలని ఫేస్ చేస్తూ ఉంటుంది ర‌ష్మి. తాజాగా ఓ పీఆర్ ఏజెంట్ ర‌ష్మీ ఫోన్ నెంబ‌ర్ కోసం స‌రికొత్త ప్లాన్ చేసి బొక్క బోర్లా ప‌డ్డాడు . మ్యాట‌ర్‌లోకి వెలితే నెటిజ‌న్స్‌తో చాట్ చేస్తున్న స‌మయంలో ర‌ష్మీకి ఓ వ్య‌క్తి నుండి ఓ మెసేజ్ వ‌చ్చింది. ఓ యాడ్ కోసం మిమ్మ‌ల్ని సంప్ర‌దించాల‌ని అనుకుంటున్నా. మీ ఫాద‌ర్ నెంబ‌ర్ మిస్ అయింది. ఏం అనుకోకుండా మీ ఫాద‌ర్ నెంబ‌ర్ సెండ్ చేస్తారా అని కాస్త అతి తెలివి ప్ర‌ద‌ర్శించాడు. కాని అది బెడిసి కొట్టింది.

పీ ఆర్ అని చెప్పుకున్న ఓ ప్ర‌బుద్దుడు ట్వీట్‌కి ర‌ష్మీ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది .నేను 12 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే మా నాన్న చ‌నిపోయారు. నాకు తెలిసి ఆయ‌న నెంబ‌ర్ మీ ద‌గ్గ‌ర ఉండ‌దు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వ‌ల‌న ఫూల్ అయ్యేందుకు ఇక్క‌డ ఎవ‌రు రెడీగా లేరు. పీ ఆర్ మేనేజ్‌మెంట్ అంటూ అమ్మాయిల‌తో మాట్లాడ‌టానికి ఇదొక కొత్త మార్గం అని నాకు తెలుసు. మీలాంటి వాళ్ళే ఇండ‌స్ట్రీ పేరుని చెడ‌గొడుతున్నారు అంటూ ఆ వ్య‌క్తికి కౌంట‌ర్ ఇచ్చింది. ర‌ష్మి దెబ్బ‌కి కంగుతిన్న స‌ద‌రు వ్య‌క్తి వెంట‌నే త‌న ట్వీట్‌ని డిలీట్ చేశాడు. ప్ర‌స్తుతం ర‌ష్మి ట్వీట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


2154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles