యాక్సిడెంట్ చేసిన ర‌ష్మీ.. విష‌మంగా ఉన్న వ్య‌క్తి ఆరోగ్యం

Tue,March 19, 2019 12:56 PM
Rashmi Gautam rams her car into a pedestrian

న‌టి, యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మైన ర‌ష్మీ ఇటీవ‌ల ఓ కొత్త కారు కొంది. అయితే ఈవెంట్ కోస‌మ‌ని కారులో విశాఖ‌ప‌ట్నం వెళ్ల‌గా , అక్క‌డ రోడ్డు దాటుతున్న వ్య‌క్తిని ర‌ష్మీ కారు ఢీ కొట్టింది. ఆ వ్య‌క్తి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంద‌ని తెలుస్తుంది. ఈ సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలోని గాజువాక ప్రాంతంలోని కుర్మ‌న్న‌పాలేంలో జ‌రిగింది. ర్యాష్ డ్రైవింగ్ వ‌ల‌న‌నే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని స్థానికులు చెబుతున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌ర్వాత విశాఖ‌ప‌ట్నంలోని ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ట‌. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థలానికి చేరుకొని ర‌ష్మీపై పోలీసు కేసు న‌మోదు చేసి, త‌న కొత్త‌కారుని సీజ్ చేశార‌ని స‌మాచారం. మార్చి 17న ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌గా, ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. రానున్న రోజుల‌లో ర‌ష్మీ, త‌న‌ డ్రైవ‌ర్ విచార‌ణ కోసం విశాఖ‌ప‌ట్నానికి వెళ్ళవ‌ల‌సి ఉంటుంది.

5977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles