వెంకీమామ‌లో రాశీఖ‌న్నా ఫైన‌ల్ అయిన‌ట్టేనా..!

Fri,February 22, 2019 11:46 AM
Rashi Khanna to be part in venky mama

నాగ చైత‌న్య‌, వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బాబీ తెర‌కెక్కించ‌నున్న చిత్రం వెంకీ మామ ( వ‌ర్కింగ్ టైటిల్‌). మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా ఎవ‌రు న‌టిస్తారు అనే దానిపై కొన్నాళ్ళుగా ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్ ఫైన‌ల్ కాగా, చైతూ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ లేదా న‌భా న‌టేష్ న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌ల మంచి స‌క్సెస్‌లు సాధిస్తున్న రాశీ ఖ‌న్నాని చైతూకి జోడీగా ఎంపిక చేసార‌ని అంటున్నారు. గ‌త ఏడాది తొలిప్రేమ వంటి రొమాంటిక్ఎంట‌ర్‌టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. వెంకీ మామ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంద‌ని , తొలి షెడ్యూల్‌ని రాజ‌మండ్రిలో జ‌ర‌పాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాని కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.



3004
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles