హాఫ్ సెంచ‌రీ కొట్టిన రారండోయ్ వేడుక చూద్ధాం

Fri,July 14, 2017 05:53 PM
Rarandoi Veduka Chudham reached the mark of 50 Days

నాగ చైత‌న్య‌, ర‌కుల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించిన‌ చిత్రం రారండోయ్ వేడుక చూద్ధాం. నాగార్జున నిర్మాణంలో అన్న‌పూర్ణ బేన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం 30 కోట్ల వ‌సూళ్ళ‌ను రాబ‌ట్ట‌డ‌మే కాక చైతూ కెరియ‌ర్ లో హైయ‌స్ట్ వ‌సూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ రోజుతో రారండోమ్ వేడుక చూద్ధాం చిత్రం 50 రోజుల మార్క్ ని అందుకోగా మేక‌ర్స్ పోస్టర్ ని విడుద‌ల చేస్తూ ఆడియ‌న్స్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇక త్వ‌ర‌లో స‌క్సెస్ వేడుక కూడా నిర్వ‌హించాల‌ని టీం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో మలుపులు, ఉత్కంఠభరిత సన్నివేశాలు లేకపోయినా చాలా చక్కటి అనుభూతిని పంచే మంచి సినిమాగా అభిమానుల మ‌న‌సుల‌లో నిలిచింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం, బాణీలతో ఈ సినిమాకు ప్రాణం పోశారు దేవిశ్రీప్రసాద్. ఆయన స్వరపరచిన థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. పల్లెటూరి అందాలను సహజంగా సినిమాలో చూపించారు ఛాయాగ్రహకుడు విశ్వేశ్వర్. ప్రకృతి అందాల నడుమ పాటలను చిత్రీకరించిన తీరు బాగుంది. తన అభిరుచులకు అనుగుణంగా సినిమాను చాలా ఉన్నతంగా తెరకెక్కించారు నాగార్జున. ప్రతి ఫ్రేమ్‌లో సినిమా కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ, తపన కనిపించింది. ఈ ర‌కంగా రారండోయ్ వేడుక చూద్దాం అందమైన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని మిగిల్చింది అని చెప్ప‌వ‌చ్చు.


1696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS