స‌మంత కొడుకుగా రావు ర‌మేష్..!

Sat,December 22, 2018 01:26 PM

ఇటివ‌లి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలకి ఆదరణ మరింత పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో అనుష్క, నయనతార, త్రిష వంటి భామలు ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. రీసెంట్‌గా యూట‌ర్న్ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించిన స‌మంత మ‌రోసారి క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. ఈ చిత్రం 'అలా మొదలైంది', 'కల్యాణ వైభోగమే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే నందిని.. సామ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది.


నందిని రెడ్డి- స‌మంత కాంబినేష‌న్‌లో రానున్న చిత్రం కొరియన్ భాషలో తెరకెక్కిన మిస్ గ్రానీకి రీమేక్ అంటున్నారు. ఇందులో స‌మంత 70 ఏళ్ళ వృద్ధురాలి పాత్ర‌లో క‌నిపించినుంద‌ట‌. అయితే తాను 20 యేళ్ల యువతిగా మారిపోతే ఎలా ఉంటుంది? తనకి 50 యేళ్ల కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అని క‌లలు కంటుంద‌ట‌. ఆ 50 ఏళ్ళ కొడుకు పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు రావు ర‌మేష్ క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. స‌మంత‌, రావు ర‌మేష్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని అంటున్నారు. తెలుగు రీమేక్‌కి ఓ బేబి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

ఈ ఏడాది స‌మంత న‌టించిన రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు, సీమ‌రాజా, యూ ట‌ర్న్ వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఆమె తాజా చిత్రాల‌పై అభిమానులల‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ భారీగా ఉన్నాయి. స‌మంత‌ ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ చైతూతో క‌లిసి శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ ప్రేమ క‌థా చిత్రం చేస్తుంది. ఈ చిత్రానికి మ‌జిలీ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

5057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles