ర‌ణ్‌వీర్‌.. ఇక నిన్ను ఎవ‌రూ ఆప‌లేరు: దీపికా ప‌దుకొనె

Fri,January 4, 2019 04:10 PM
Ranveer Singh You Are Unstoppable deepika praises ranveer on his gully boy teaser

ర‌ణ్‌వీర్ న‌టించిన సింబా ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఇంత‌లోనే గ‌ల్లీ బాయ్ అంటూ ఆ సినిమాలోని కొత్త లుక్‌ల‌తో త‌న అభిమానుల ముందుకొచ్చాడు ర‌ణ్‌వీర్‌. అలియా, ర‌ణ్‌వీర్‌కు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవ‌లే బ‌య‌టికి వ‌చ్చాయి. త‌ర్వాత గ‌ల్లీ బాయ్ టీజ‌ర్ తో హుషారెత్తించాడు ర‌ణ్‌వీర్‌. 'అస్లీ హిప్ హాప్' పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో ర‌ణ్‌వీర్ రాప‌ర్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాలోని మొద‌టి పాట‌ను అది కూడా హిప్ హాప్ మ్యూజిక్ తో రిలీజ్ చేయ‌డం, ఆ వీడియోలో స‌రికొత్త‌గా ర‌ణ్‌వీర్ క‌నిపించ‌డంతో సినీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.


ముంబైలోని ఓ చిన్న గ‌ల్లీలో ఉండే యువ‌కుడి ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ర‌ణ్‌వీర్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జోయా అక్త‌ర్ డైరెక్ట‌ర్‌. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14 న సినిమా రిలీజ్ అవ‌నుండ‌గా.. సినిమా ట్రైల‌ర్ మాత్రం జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానుంది.

అయితే.. ర‌ణ్‌వీర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అస్లీ హిప్ హాప్ పేరుతో త‌న ఫోటోను షేర్ చేయ‌డంతో ర‌ణ్‌వీర్ భార్య దీపికా ప‌దుకొనె... కామెంట్ చేసింది. ర‌ణ్‌వీర్.. నిన్నెవ‌రూ ఆప‌లేరు. ఐ ల‌వ్ యూ.. నిన్ను చూస్తుంటే నాకు గ‌ర్వంగా ఉందంటూ కామెంట్ చేసింది.

దీపికే కాదు.. గ‌ల్లీ బాయ్‌కి క‌ర‌ణ్ జోహార్‌, అభిషేక్ బ్చ‌న్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇంకా ఇత‌ర సినీ ప్ర‌ముఖుల నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

4155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles