ఆ సినిమా కోసం లెజెండరీ బౌలర్ దగ్గర శిక్షణ

Thu,February 7, 2019 02:42 PM
Ranveer Singh to train with Kapil Dev for movie 83

ఇండియాలో క్రికెట్, సినిమా అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందుకే క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా హిట్ కొట్టాయి. తాజాగా అలాంటిదే మరో మూవీ తెరకెక్కబోతున్నది. భారత క్రికెట్ చరిత్రనే మార్చేసిన 1983 వరల్డ్‌కప్ విజయంపై కబీర్ ఖాన్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరు 83. ఆ వరల్డ్‌కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రను ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం గల్లీ బాయ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో.. మూవీ రిలీజ్ తర్వాత 83 మూవీ కోసం రణ్‌వీర్ సిద్ధం కానున్నాడు. పంజాబ్ వెళ్లి నేరుగా కపిల్ దేవ్ దగ్గరే ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడు రణ్‌వీర్. మూడు వారాల పాటు ఈ ట్రైనింగ్ కొనసాగుతుంది. కపిల్ బౌలింగ్ యాక్షన్‌ను రణ్‌వీర్ నేర్చుకోనున్నాడు. కపిల్ సర్‌తో విలువైన సమయం గడపడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సాధ్యమైనంత వరకు ఆయనలా మారడానికి ప్రయత్నిస్తాను. ఆయన కథ, అనుభవాలు, ఆలోచనలు, భావనలు ఇలా అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని రణ్‌వీర్ చెప్పాడు.

1983 వరల్డ్‌కప్‌లో కనీసం అండర్ డాగ్‌గా కూడా బరిలోకి దిగని టీమిండియా.. ఏకంగా విశ్వవిజేతగా నిలిచి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అందులో కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రే కీలకం. అలాంటి వ్యక్తి క్యారెక్టర్‌ను పోషిస్తుండటం రణ్‌వీర్‌కు ఒక విధంగా సవాలే. కపిల్ బౌలింగ్ యాక్షన్‌ను అలాగే అందిపుచ్చుకోవడం తనకు అతిపెద్ద సవాలని రణ్‌వీర్ అన్నాడు. 1983లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌ను ఓడించి ఇండియా వరల్డ్‌కప్ గెలిచింది. దీంతో మూవీని కూడా లార్డ్స్‌లోనే చిత్రీకరించే ప్లాన్ చేస్తున్నారు. లార్డ్స్ బాల్కనీలో కపిల్ వరల్డ్‌కప్ అందుకుంటున్న సీన్‌ను కూడా అలాగే చిత్రీకరించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

1655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles