దీపిక ల‌వ‌ర్‌తో సెల్ఫీ దిగేంద‌కు పోటీప‌డ్డ ఫ్యాన్స్‌

Fri,August 10, 2018 01:23 PM
Ranveer Singh Protects Female Fans From Unruly Crowd

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌లు త్వ‌ర‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ముంబైలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రీసెంట్‌గా ర‌ణ‌వీర్ సింగ్ ముంబైలోని ఫ్యాష‌న్ స్టోర్ ఓపెనింగ్‌కి వెళ్ళాడు. ఆయ‌న రాక గురించి ముందుగానే తెలుసుకున్న అభిమానులు ఆయ‌న‌తో సెల్ఫీలు దిగేందుకు చుట్టు ముట్టారు. ఈ క్రమంలో అమ్మాయిల‌కి రక్ష‌ణగా నిలిచిన ర‌ణ్‌వీర్ ముందుగా వారితో సెల్ఫీలు దిగి పంపించాడు. ఆ త‌ర్వాత మిగ‌తా వారితో క‌లిసి ఫోటోల‌కి ఫోజులిచ్చాడు. వెళ్ళే ముందు కారు టాప్ ఎక్కి అంద‌రికి అభివాదం చేశాడు. ర‌ణ్‌వీర్‌ని చూసిన అభిమానులు ఆయ‌న‌తో చేయి క‌లిపేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు. ప్ర‌స్తుతం గ‌ల్లీ బాయ్ మ‌రియు సింబా అనే సినిమాల‌తో బిజీగా ఉన్నాడు ఈ ల‌వ‌ర్ బోయ్. 1983లో ఇండియాకి వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన క‌పిల్ దేవ్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర ర‌ణ‌వీర్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Ranveer Singh At JACK & JONES Store | Ranveer Singh Out For Shopping

A post shared by 🔥🔥 (@bollywood.loverss_) on

2150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS