దీపిక ప్రెగ్నెంటా? రణ్‌వీర్ ఆ ఫోటో ఎందుకు షేర్ చేసినట్టు..?

Fri,May 24, 2019 04:52 PM

రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. అది దీపికా పదుకొణె ఫోటో. కాకపోతే.. ఆ ఫోటో చూస్తే దీపిక చిన్ననాటి ఫోటోలా ఉంటుంది. కానీ.. అది దీపిక చిన్ననాటి ఫోటో కాదు. ఇటీవల జ‌రిగిన‌ కేన్స్ ఉత్సవాలకు వెళ్లిన దీపిక రకరకాల డ్రెస్సులు వేసుకొని ఫోటోలకు పోజిచ్చింది కదా. వాటిలో ఒక ఫోటోకు ఇన్‌స్టాగ్రామ్‌లోని న్యూబేబీ ఫిల్టర్‌ను అప్లయి చేసి తన ఫోటోను చిన్ననాటి ఫోటోలా మార్చి ఆ ఫోటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.


ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? అరె.. ఇది నిజంగా దీపిక చిన్ననాటి ఫోటోనా? బేబీ దీపిక చాలా బాగుంది. దీపిక చిన్ననాటి ఫోటోను పెట్టాలని రణ్‌వీర్‌కు ఎందుకు అనిపించింది. దీపిక ప్రెగ్నెంట్ కాదు కదా? దీపిక ప్రెగ్నెంట్ అన విషయాన్ని రణ్‌వీర్ తన అభిమానులకు ఇలా చెబుతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ ఫోటోపై దీపికా పదుకొణె ఇప్పటి వరకు స్పందించలేదు.

దీపిక, రణ్‌వీర్ కలిసి మూడు సినిమాల్లో నటించారు. గత సంవత్సరం వీళ్ల పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. రణ్‌వీర్ రీసెంట్‌గా గల్లీ బాయ్ సినిమాతో ఆకట్టుకున్నాడు. దీపిక.. పద్మావతి సినిమా తర్వాత మరే సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఛపాక్ సినిమాలో నటిస్తోంది. యాసిడ్ దాడిలో గాయపడిన ఓ యువతి పాత్రలో దీపిక నటిస్తోంది.
View this post on Instagram

👶🏻💚 @deepikapadukone

A post shared by Ranveer Singh (@ranveersingh) on


3483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles