కపిల్ దేవ్ లుక్ లో రణ్ వీర్..ఫొటో వైరల్

Tue,April 30, 2019 08:21 PM
Ranveer Singh in Kapil Dev look


బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో వస్తున్న బయోపిక్ కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 83 చిత్రం. 1983 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నాడు. ఇకపిల్‌దేవ్ మేనరిజమ్స్, స్టైల్స్ ను అనుకరిస్తున్న రణ్ వీర్..83 చిత్రానికి సంబంధించిన తన రెట్రో లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ తరహాలో జులపాలతో ఉన్న రణ్‌వీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ రెట్రో లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles