ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు ఫుల్ ఫైర్ అయిన ర‌ణ‌వీర్

Wed,September 5, 2018 02:02 PM
Ranveer Singh Gets Furious Over A Man Driving Rashly

బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ఎంత స‌ర‌దాగో, ఎంత కూల్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కంపెనీని ఎంతోమంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఇటీవ‌ల ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌కి వెళ్ళిన ర‌ణవీర్‌ని అభిమానులు చుట్టుముట్టి సెల్ఫీ కావాల‌ని కోర‌గా ప్ర‌తి ఒక్క‌రికి స‌ప‌రేట్‌గా సెల్ఫీలు ఇచ్చి వారిని ఆనంద‌ప‌ర‌చారు. మ‌రి అంత శాంతంగా ఉండే ర‌ణ‌వీర్ రీసెంట్‌గా ఫుల్ ఫైర్ అయ్యాడు తాను రోడ్డుపైన ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌క్క‌నుండి ఓ వ్య‌క్తి రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. దీంతో కోపోద్రిక్తుడైన సింబా హీరో ఆ వ్య‌క్తిపై తిట్ల దండ‌కం అందుకున్నాడు. అయితే త‌ను సారీ చెబుతున్న కూడా ఫ్యామిలీ ముందు అలాంటి మాట‌లు మాట్లాడినందుకు స‌ద‌రు వ్య‌క్తి ట్విట్ట‌ర్ ద్వారా ర‌ణ‌వీర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ర‌ణ‌వీర్ తిడుతున్న వీడియోని కూడా పోస్ట్‌లో షేర్ చేశాడు. గ‌తంలో అనుష్క కూడా రోడ్డుపైన చెత్త వేసిన వ్య‌క్తిపై ఇదే రేంజులో ఫైర్ అయింది. అప్ప‌ట్లో ఈ ఇష్యూ పెద్ద సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌స్తుతం టెంప‌ర్ రీమేక్ సింబా చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.


2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS