వైర‌ల్‌గా మారిన ర‌ణ్‌వీర్‌, దీపిక డ్యాన్స్ వీడియో

Sat,October 6, 2018 11:47 AM
Ranveer Singh, Deepika Padukone recreate  Khalibali  magic

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోనే పెళ్లి గురించి కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 20న ఇట‌లీలోని కోమో సరస్సు వేదిక‌గా పెళ్ళి జ‌ర‌గ‌నుంద‌ని, వీరి వివాహ వేడుకకు 30 మంది ఎంపిక చేసిన అతిధులకు మాత్రమే హాజ‌రు కానున్నార‌ని పుకార్లు షికారు చేశాయి. డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్న దీప్ వీర్ జంట ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వ‌ర‌లో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయ‌నున్నారని అన్నారు. అయితే దీపిక‌- పెళ్లి విష‌యం బయ‌ట‌కి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వీరిద్ద‌రిని కెమెరాలు ఫాలో అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఈవెంట్‌కి వీరిద్ద‌రు హాజ‌రు కాగా,అక్క‌డ ఇద్ద‌రు క‌లిసి క‌లిబ‌లి అనే పాట‌కి అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది .ర‌ణ్‌వీర్ ప్ర‌స్తుతం సింబా, గల్లీ బాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా వెన్ను నొప్పి నుండి కోలుకుంటున్న దీపికా త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది.

View this post on Instagram

#deepikapadukone #ranveersingh ❤️❤️

A post shared by Viral Bhayani (@viralbhayani) on

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles