డెస్టినేష‌న్ వెడ్డింగ్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్న బాలీవుడ్ జంట‌

Sun,April 29, 2018 08:22 AM
Ranveer Singh  ,Deepika Padukone destination wedding

బాలీవుడ్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ మ్యారేజ్ త‌ర్వాత సోన‌మ్ క‌పూర్‌- ఆనంద్ అహుజా, దీపికా ప‌దుకొణే- ర‌ణ్‌వీర్ సింగ్‌ల ప్రేమ పెళ్ళి హాట్ టాపిక్ అయింది. ఈ ఇరు జంట‌ల పెళ్ళికి సంబంధించి రోజుకో వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. ఇప్ప‌టికే సోన‌మ్ క‌పూర్ ఇంట పెళ్ళి సంద‌డి మొద‌లైంద‌ని తెలుస్తుండ‌గా, మే 8 లేదా 9 తేదీల‌లో త‌న ఫ్రెండ్ ఆహుజాని వివాహం చేసుకోనుంద‌ని తెలుస్తుంది. ఇక దీపిక‌, ర‌ణ్‌వీర్ సింగ్‌ల విష‌యానికి వ‌స్తే వీరి నిశ్చితార్ధం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఇప్ప‌టికే జ‌రిగిన‌ట్టు స‌మాచారం. పెళ్ళి స్విట్జ‌ర్‌లాండ్‌లో డెస్టినేష‌న్ త‌ర‌హాలో జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. రిసెప్ష‌న్ మాత్రం ముంబైలోనే జ‌రుపుకుంటార‌ట‌. ఈ కార్య‌క్ర‌మాల‌కి సంబంధించి ఇరు కుటుంబాలు ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ని కూడా నియమించుకున్నారట .

ఇటీవ‌ల పెళ్ళి విష‌యంపై దీపిక‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా, ఏం మాట్లాడ‌కుండా వెళ్ళింది. ర‌ణ్‌వీర్ మాత్రం తాను తప్ప‌కుండా పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడు. పెళ్ళి చేసుకోకుండా ఉండ‌డానికి నేను స‌న్యాసిని కాదు క‌దా. పెళ్ళి డేట్ ఇద‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేను. ప్ర‌స్తుతానికి మా వ‌ర్క్స్‌తో మేము బిజీగా ఉన్నాము. దీపిక తీవ్ర మెడినొప్పితో బాధ‌ప‌డుతుంది. పెళ్ళి విష‌యంలో అంతా ఫైన‌ల్ అయితే నేను మేడ పైకి ఎక్కి అంద‌రికి వినప‌డేలా గ‌ట్టిగా కేక‌లు వేస్తాన‌ని వెల్ల‌డించాడు ర‌ణ్‌వీర్ . రణ్‌వీర్ ప్ర‌స్తుతం గ‌ల్లీబాయ్, సింబా సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, దీపిక విట‌మిన్ 3డీ లోపం కార‌ణంగా చికిత్స తీసుకుంటుంది. త్వ‌ర‌లో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయ‌నుంది. 2013లో ‘గలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమాలో కలిసి నటించిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు షికారు చేశాయి.

2038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles