రెండు విష‌యాలు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటా: ర‌ణ్‌వీర్

Tue,September 17, 2019 12:13 PM

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ఎక్క‌డ ఉంటే అక్కడ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటుంది. ఎన్నో వైవిధ్య పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న రణ్‌వీర్ తాజాగా క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. అయితే ఒక మంచి నటుడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా ఎదిగినర‌ణ్‌వీర్ సింగ్ యొక్క కథ చాలా మందికి ఆదర్శవంతమైనది. ఎనిమిది సంవత్సరాల్లోనే వరుస హిట్ల తో చెలరేగుతూ, దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న ఏకైక నటుడిగా పేరొందాడు . బ్యాండ్ బాజా బారాత్, రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, గల్లీ బాయ్ లాంటి అపురూపమైన చిత్రాలలో గుర్తుండిపోయే పాత్రలు పోషించి, ర‌ణ్‌వీర్ సింగ్ జనాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇది కాకుండా, 2020 లో పలు ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఈ యువ నటుడు కనపడనున్నాడు.


కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 83 , యాష్ రాజ్ ఫిలిమ్స్ చే నిర్మితవుతున్న జయేష్ భాయ్ జోర్దార్, కరణ్ జోహార్ స్వీయంగా నిర్మిస్తూ దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న తఖ్త్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యే ప్రయత్నం లో ఉన్నాడు ర‌ణ్‌వీర్ . కానీ బాలీవుడ్ లో నటించే అవకాశాలు లేక పని కోసం పరితపించే రోజుల్ని నెమరువేసుకోవడమే తన పెదవులపై ఒక చిరునవ్వుని చిగురించేలా చేస్తోందని చెప్పుకొస్తున్నాడు ర‌ణ్‌వీర్ సింగ్.

"నాకు జీవిత పాఠాలు నేర్పిన రోజులు అవే. ఇప్పుడేదో నా వైపు గాలి వీస్తోంది కానీ, ఒకానొక కాలం లో ఈ కీర్తి ప్రతిష్టలు నాకుండేవి కావు . ఆత్మ స్థైర్యం కోల్పోయి నాకు ఎప్పటికన్నా ఒక వేషం దొరకతుందా అని తపించిన రోజులవి. చాలా కష్టాలు అనుభవించే ఈ స్థాయికి రాగలిగాను. ఎన్నో అనుభవాలు, అవమానాలు, అపజయాలు దాటుకుంటూ, నన్ను నేను వెతుక్కుంటూ, సినీ పరిశ్రమలో ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగాను," అని పేర్కొన్నాడు ర‌ణ్‌వీర్ .

తన జీవిత సూత్రాల గురించి వివరిస్తూ, ర‌ణ్‌వీర్ ఈ విధంగా పేర్కొన్నాడు . "నేను రెండు విషయాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. నాకు నటన పై పిచ్చి ఉండి ఈ పరిశ్రమకు వచ్చాను గాని, ఎదో పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో మాత్రం రాలేదు. నా సామర్ధ్యం పై నాకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కోల్పోలేదు. నేను ఎంచుకున్న దారి లో పయనిస్తూ నాకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకొచ్చాను. ఈ విషయంలో నేను ఇప్పటికీ మారలేదు అని చెప్పుకొచ్చారు ."

961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles