బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే, స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని గత ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. లేక్ కోమో వేదికగా వీరి వివాహం జరగగా, నవంబర్ 14న కొంకణి వివాహ పద్దతిలో, 15న సింధీ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇక 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేశారు. అయితే వీరిరివురి వివాహం జరిగి రేపటితో ఏడాది కానుంది. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన ఏర్పాట్లని బాజీరావ్ మస్తానీ యాక్టర్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం తమ వెడ్డింగ్ డే రోజు దీపికా, రణ్‌వీర్‌లు తిరుపతిలోని బాలాజీ, పద్మావతి ఆలయాలని సందర్శించనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్‌కి కూడా వెళ్ళనున్నారట. వీరిద్దరు కపిల్ దేవ్ బయోపిక్ 83లో కలిసి నటించగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.