కిస్ సీన్‌కి క‌త్తెర వేసిన సెన్సార్ బోర్డ్

Wed,February 13, 2019 10:24 AM
Ranveer Singh Alia Bhatt Film Faces CBFC Scissors

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ల్లీబాయ్. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్రానికి ప‌లు క‌ట్స్‌తో U/A స‌ర్టిఫికెట్ అందించారు సెన్సార్ బోర్డ్‌. ముఖ్యంగా ఓ రొమాంటిక్ స‌న్నివేశంలో ర‌ణ‌వీర్‌, అలియా మ‌ధ్య ఉన్న 13 సెక‌న్ల ముద్దు స‌న్నివేశం నిడివి త‌గ్గించ‌మ‌ని సీబీఎఫ్‌సీ సూచ‌న చేయ‌డంతో పాటు క్లోజ‌ప్ షాట్‌ని వైడ్ యాంగిల్‌లో చూపించమ‌ని స‌ల‌హా ఇచ్చింద‌ట. ఇది మిన‌హా సినిమాకి సంబంధించి ఎలాంటి స‌మస్య లేద‌ని చిత్ర నిర్మాత రితేష్ సిద్వానీ పేర్కొన్నారు. గ‌ల్లీ బాయ్ చిత్రాన్ని ఇటీవ‌ల బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌గా ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం భారీ విజ‌యం సాధిస్తుంద‌ని చిత్ర బృందం ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది.

2803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles