న‌చ్చిన సినిమాల‌తో ఉన్న సూట్ ధ‌రించి అవార్డ్ ఫంక్ష‌న్‌కి వెళ్లిన హీరో

Sun,January 21, 2018 12:32 PM
RANVEER DREES ATTRACTS THE AUDIENCE

అభిమానుల‌కి సినిమా పిచ్చి ఉంటే ఏం చేస్తారో మ‌నం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా పోస్ట‌ర్స్‌ని గోడ‌ల‌పైకి ఎక్కించ‌డం లేదంటే టాటూలు వేసుకోవ‌డం అదీ కాదంటే త‌మ బ‌ట్ట‌ల‌పై కూడా పోస్ట‌ర్స్‌ని ముద్రించుకోవ‌డం చేస్తుంటారు . ఇలాంటివి ఫ్యాన్స్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. కాని ఓ టాప్ హీరో త‌న‌కి న‌చ్చిన సినిమాల‌ని సూట్‌పైన ముద్రించుకొని, ఆ సూట్‌తో అవార్డ్ ఫంక్ష‌న్‌కి వెళ్ల‌డం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ అవార్డ్ ఫంక్ష‌న్స్‌లోనో లేదంటే ఏదైన ఈవెంట్‌లోనో ఏదో ప్ర‌త్యేక‌త‌తో క‌నిపిస్తుంటాడు. హెయిర్ స్టైల్‌తో పాటు డ్రెస్సింగ్ స్టైల్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు మార్చే ర‌ణ్‌వీర్ సింగ్ నిన్న రాత్రి ముంబైలో జ‌రిగిన 63వ ఫిలింఫేర్ అవార్డ్ కార్య‌క్ర‌మంకి ప్ర‌త్యేక సూట్‌తో హాజ‌ర‌య్యాడు. ఈ సూట్‌పై చిన్న‌త‌నం నుండి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కి నచ్చిన సినిమాల‌న్నింటిని ప్రింట్ చేయించుకున్నాడు. తాను హీరో అయ్యేందుకు స్ఫూర్తినిచ్చిన హీరోలందరి గౌరవార్థం ర‌ణ్‌వీర్‌ ఈ సూట్ ధరించాడని అతడి స్టైలిస్ట్ తెలిపాడు. వెరైటీ సూట్‌తో ఉన్న ర‌ణ్‌వీర్ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఇక ర‌ణ్‌వీర్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పద్మావ‌త్ చిత్రం జ‌నవ‌రి 25న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీలో అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగెటివ్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు ఈ బాలీవుడ్ హీరో.

2267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS