అభిమానుల‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపిన ర‌ణ‌వీర్ సింగ్

Thu,February 7, 2019 09:48 AM
Ranveer Apologizes For Jumping At The Crowd

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఒక్కోసారి తాను సెల‌బ్రిటీ అనే విష‌యాన్నే మ‌రచిపోయి విచిత్ర చేష్ట‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంటాడు. ఇటీవ‌ల లాక్మె ఫ్యాషన్ వీక్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో అప్నా టైమ్ ఆయేగా పాట పాడుతూ.. సడెన్‌గా స్టేజ్ కింద ఉన్న ఫ్యాన్స్‌పైకి దూకాడు. దీంతో కొంద‌రు అభిమానుల‌కి గాయాల‌య్యాయి. అయితే ర‌ణ‌వీర్ చ‌ర్య‌ని కొంద‌రు త‌ప్పుపట్ట‌గా, ఇప్ప‌టికైన పిల్ల చేష్టలు మానుకో అంటూ కొంద‌రు ఘాటుగా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ర‌ణ‌వీర్ త‌న వల‌న ఇబ్బంది ప‌డిన అభిమానుల‌కి క్ష‌మాప‌ణ‌లు తెలిపాడు. ఇకనుండి అలా ఎప్పుడు చేయ‌న‌ని అన్నాడ‌ట‌. త‌న‌పై చూపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు ర‌ణ‌వీర్‌. ప్ర‌స్తుతం గల్లీబాయ్ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాడు ర‌ణ‌వీర్‌. ఇందులో అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టించింది. జోయా అక్త‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఫిబ్ర‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

1704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles