రణ్‌వీర్, దీపికా పెళ్లి డేట్ ఫిక్సయింది!

Fri,June 22, 2018 04:23 PM
Ranveer and Deepika to get married on November 10th according to a report in Filmfare Magazine

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి డేట్ ఫిక్సయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే వీళ్ల పెళ్లి పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం పక్కాగా ఓ తేదీయే వార్తల్లోకి రావడం విశేషం. ప్రముఖ మ్యాగజైన్ ఫిల్మ్‌ఫేర్ ప్రకారం నవంబర్ 10న వీళ్లిద్దరూ ఓ ఇంటివాళ్లు కానున్నట్లు సమాచారం. పెళ్లి తేదీ ఖరారు చేయడానికి ఇద్దరూ చాలా సమయం తీసుకున్నారు. తమ పెళ్లి వేడుక ఘనంగా జరిగేలా రణ్‌వీర్, దీపికా ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 10వ తేదీ ముహూర్తానికి ఈ ఇద్దరితోపాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు.

పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. పెళ్లి తేదీ కూడా కొన్ని వారాల కిందటే ఖరారు చేశారు అని ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ వెల్లడించింది. అంతేకాదు పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నది.

2017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles