డీ గ్లామ‌ర్ లుక్‌లో రణ్‌వీర్‌, అలియా

Tue,January 16, 2018 03:19 PM
ranveer, alia pics goes viral

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌, అందాల భామ అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జోయా అఖ్తర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం గల్లీ భాయ్. వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ వ‌స్తున్న ర‌ణ్‌వీర్ ఈ మూవీలో చీర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ వేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ర‌ణ్‌వీర్‌, అలియాల‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అలియా లైట్ మేక‌ప్ వేసుకొని స్కార్ఫ్ ధ‌రించ‌గా, ర‌ణ్‌వీర్ గ్రే జాకెట్‌లో డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ చిత్ర‌షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ర‌ణ్‌వీర్ న‌టించిన ప‌ద్మావ‌త్ మూవీ జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుండ‌గా, ఇందులో క్రోధం, వీరం కలిగిన ఖిల్జీ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత చీర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ లో ర‌ణ్ వీర్ క‌నిపించ‌నుండ‌డం ఫ్యాన్స్‌కి ఆనందాన్ని క‌లిగిస్తుంది.

1864
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles