ర‌ణు మొండ‌ల్‌పై ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Wed,November 6, 2019 10:20 AM

పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ రైల్వే స్టేషన్ వద్ద పాటలు పాడుకుంటూ జీవనం సాగించే ర‌ణు మొండ‌ల్ ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీ అయిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రేష్మియాతో క‌లిసి ‘తేరీ మేరీ కహానీ’ పాట పాడిన రనూ మండల్‌కు మరింత క్రేజ్ పెరిగింది. ఆమెపై బ‌యోపిక్ కూడా రూపొందించే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అయితే త‌క్కువ స‌మ‌యంలో ఇంత ఫేమ‌స్ అయిన ర‌ణు మొండ‌ల్ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో హాట్ టాపిక్‌గా మారింది.


ర‌ణు తాజాగా ఓ సూప‌ర్ మార్కెట్‌కి షాపింగ్ కోసం అని వెళ్లింది. ర‌ణుని గుర్తించిన ఓ మ‌హిళా అభిమాని ఆమె చేయి ప‌ట్టుకొని సెల్ఫీ కోసం అడిగింది. నా చేయి ప‌ట్టుకుంటావా అని అభిమానిపై ఫైర్ అయింది ర‌ణు. ఈ సంఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, ర‌ణు ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎంత సెల‌బ్రిటీ అయితే మాత్రం ఫ్యాన్‌తో ఆ విధంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ర‌ణుపై ఫైర్ అవుతున్నారు.7111
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles