రంగ‌స్థ‌లం వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియో

Tue,July 10, 2018 09:41 AM
Rangasthalam VFX making Video released

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ , స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా ప్ర‌కాశ్ రాజ్, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించారు. జూలై 8తో ఈ చిత్రం వంద రోజుల స‌క్సెస్ ర‌న్ పూర్తి చేసుకుంది. రంగస్థలం వంద రోజులు ఆడిందంటే దాని వెనుక ఎంతో మంది కృషి వుంది. ఒక సినిమా విజయం ఒక వ్యక్తి ఆలోచన నుంచే పుడుతుంది. ఈ సినిమా సుకుమార్ ఆలోచన నుంచి మొదలైంది. ఆయన ఆలోచన, మొండి బలం నుంచి పుట్టిన కథ ఇది. ఇంత మంచి చిత్రాన్నిచ్చిన సుకుమార్‌కు జీవితాంతం రుణపడి వుంటాను అని అన్నారు రామ్‌చరణ్. దేవి శ్రీ సంగీతం కూడా సినిమా విజ‌యంలో స‌గ భాగం అయింది. అయితే చిత్రంలో ప్ర‌తి సీన్ గ్రామీణ నేప‌థ్యానికి త‌గ్గ‌ట్టు చాలా అందంగా చిత్రీక‌రించారు. ఊరుకి సంబంధించిన సీన్స్‌తో పాటు కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ని వీఎఫ్ఎక్స్ తో అద్భుతంగా చూపించారు. తాజాగా వీఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియో ఒక‌టి విడుద‌ల చేశారు. ఇది చూసిన అభిమానులు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు . మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

2714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS