చైనాలో స‌త్తా చూప‌నున్న మ‌రో తెలుగు సినిమా..!

Thu,June 14, 2018 01:35 PM
Rangasthalam ready to release in china

ఇటీవ‌ల ఇండియ‌న్ సినిమాలు చైనాలో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. దంగ‌ల్‌, బాహుబ‌లి1 , బాహుబ‌లి 2, ఆమీర్ ఖాన్ సూప‌ర్ స్టార్ త‌దిత‌ర చిత్రాలు అక్క‌డ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల‌ వ‌ర్షం కురిపించాయి. అయితే తెలుగు చిత్రాల‌లో బాహుబ‌లి సిరీస్ త‌ప్ప మ‌రే చిత్రం ఇంత వ‌ర‌కు చైనాలో విడుద‌లైన దాఖ‌లాలు లేవు. కాని ఇప్పుడు రామ్ చ‌రణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నార‌ట‌.

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కి నాన్ బాహుబ‌లి సినిమాగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లోను రికార్డ్ సృష్టించిన చిత్రం రంగ‌స్థలం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్ , రామ‌ల‌క్ష్మీగా స‌మంత అద‌ర‌గొట్టారు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, ప్ర‌కాశ్ రాజ్, అన‌సూయ పాత్ర‌లు కూడా సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ని దోచుకున్నాయి. ఈ సినిమా విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు కూడా అందుకుంది అంటే రంగ‌స్థ‌లం చిత్ర మానియా ఎలా ఉందో ఊహించుకోవ‌చ్చు . ప‌లు రికార్డులు సాధించిన రంగ‌స్థ‌లం చిత్రం చైనాలో ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తుందో చూడాలి.

4006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS