అవార్డుల వేట మొద‌లు పెట్టిన 'రంగ‌స్థలం'

Thu,July 12, 2018 09:11 AM
Rangasthalam nominated for best movie

ప‌ల్లెటూరి నేప‌థ్యంతో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా ఈ చిత్రంలో క‌నిపించాడు. స‌మంత ప‌ల్లెటూరి అమ్మాయిగా అద‌ర‌గొట్టింది. ప్ర‌కాశ్ రాజ్, జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ తమ పాత్ర‌ల‌లో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టించింది. విమ‌ర్శ‌కులు కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారంటే ఈ చిత్రం ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌లే వంద రోజుల లాంగ్ పూర్తి చేసుకున్న రంగ‌స్థ‌లం ‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2018’ కోసం ‘రంగస్థలం’ ఎంపికైంది. ఉత్త‌మ చిత్ర విభాగంలో ఈ సినిమాని ఎంపిక చేశారు. ఆగ‌స్ట్ 10 నుండి22 వ‌ర‌కు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న చ‌ల‌న చిత్రోత్సవాల‌లో పాలు పంచుకోమ‌ని రామ్ చ‌ర‌ణ్‌కి ఆహ్వానం కూడా అందింది. ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్న చెర్రీ రంగ‌స్థ‌లం స్క్రీనింగ్ రోజు అక్క‌డికి వెళ‌తార‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 2018లో బెస్ట్ మూవీల‌లో ఒక‌టిగా ప్ర‌తి అవార్డుల ఎంపిక‌లో ఈ చిత్రం త‌ప్ప‌క పోటీ ఇస్తుంద‌ని అభిమానులు అంటున్నారు. రామ్ చ‌రణ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం చిత్రాన్ని చైనాలో విడుద‌ల చేసేందుకు కూడా నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నార‌ని టాక్

2501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS