రంగస్థలం మూవీ బిహైండ్ ది సీన్స్.. వీడియో

Mon,April 16, 2018 05:58 PM
Rangasthalam Movie Behind The Scenes

గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ప్ప‌టికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ని అందుకున్న చిత్రం రంగ‌స్థ‌లం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత హీరోహీరోయిన్స్‌గా న‌టించారు. మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రం రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించే దిశ‌గా అడుగులు వేస్తుంది. జ‌గ‌ప‌తి బాబు,ప్ర‌కాశ్ రాజు, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. రీసెంట్ గా మూవీ విజయోత్సవ వేడుకను కూడా నిర్వహించారు. ఇక.. ఇవాళ రంగస్థలం బిహైండ్ ది సీన్స్ అంటూ ఓ వీడియోను మూవీ యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. షూటింగ్ లో చోటు చేసుకున్న చిలిపి సంఘటనలను జ్ఞాపకాలుగా మార్చి వీడియో రూపంలో సినీ అభిమానులకు అందించారు.

5576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles